ప్రతి నాయకుడి పాత్ర ఎంత ఎలివేట్ అయితే హీరో పాత్ర అంత రాణిస్తుందని తనికెళ్ల భరణి అభిప్రాయ పడ్డారు. కానీ ఈరోజు తెలుగు సినిమాలలో విలన్ పాత్రలు కామెడీ పాత్రలతో సమానంగా మారిపోయాయనీ దానితో చాల సినిమాలలోని విలన్ పాత్రలను జోకర్ పాత్రలు లాగా ప్రేక్షకులు చూస్తునారని కామెంట్ చేసారు తనికెళ్ల.  విలనిజం అంటే నేడు హీరోని ‘వేసేయండ్రా’ అంటే హీరో మీదకి వంద మంది రౌడీలను పంపే రొటీన్ పాత్రలులా మారిపోవడానికి గల కారణం నేటి రచియితలకు ప్రతినాయకుడి పాత్రను సృష్టించడంలో శ్రద్ద తగ్గి ఎంతసేపు హీరోను ఎలివేట్ చేసే ఉద్దేశ్యంతో కధలు రాయడంతో తెలుగు సినిమాలలో రోజురోజుకు విలన్ పాత్ర ప్రాముఖ్యత తగ్గి పోతోంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు భరణి. ఇది వరకటి పాత సినిమాలలో బాలీవుడ్ లో ప్రాణ్, టాలీవుడ్ లో ఎస్వీ రంగారావు లాంటి నటులు హీరోల ఇమేజ్ ని మించి నటించే వారని అంటూ ఇప్పటికి కూడ ఆ స్థాయి ప్రతినాయక పాత్రలను పోషించే నటులు ఉన్నా హీరోలు ఎక్కడ ఫేడ్ అయిపోతారో అన్న ఉద్దేశ్యంతో చాల సినిమాలలో విలన్ ను కామెడీ డైలాగ్స్ చెప్పే పాత్రగా మార్చి తెలుగు సినిమాలలో రియల్ విలనిజమ్ ఎదగకుండా అటు దర్శకులు ఇటు రచయితలు ప్రతి నాయక పాత్రలకు అన్యాయం చేస్తున్నారని తనికెళ్ల అభిప్రాయ పడ్డారు. ఈ రోజు తనికెళ్ల భరణి పుట్టిన రోజు సందర్భంగా నేటి తెలుగు సినిమాల పై అనేక అభిప్రాయాలను భరణి మీడియాతో షేర్ చేసుకున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: