ఏక్షణంలో తొడగొట్టి ఇక పథకాలే పథకాలు కాసుకోండి తడాఖా చూపిస్థా అని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సవాల్ విసిరారో కాని అవి రివర్స్ గేర్ లో ఆయన మూతిపగలగొడుతున్నాయి. అయినా సరే ఆయన మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా పథకాల పరంపర కొనసాగిస్తూనే ఉన్నారు.

మళ్లీ ఇప్పుడు బాలికల కోసం ఓ కొత్త పథకం రూపొందించారు. దానికి బంగారు తల్లి అని నామకరణం చేసారు, దాని విధివిధానాలు నిర్ణయించడంలో అధికారులు బిజీ అయ్యారు. పేరును చూసి బాలికలకు బంగారం ఇస్తారని మురిస్తే మాత్రం మూతిముక్కలవుతుంది. ఇది కొత్త పథకం కాదట, పాతసీసాలో కొత్తసారా పోసి తాగించడమే. ఇక ఎక్కిన మత్తులో చేతిగుర్తుపై ఓట్లు గుద్దడమే అని సిఎం తెగ సంబరపడిపోతున్నరట.

ఇంతకు ముందున్న బాలికా శిషు సంరక్షణ పథకానికే ఇలా పేరు మారుస్తున్నారు. సేమ్ టు సేమ్ అలాగే ఉంటే పరువు పోతుందని కాస్తా చేంజేస్ చేస్తున్నారట. ఇదంతా బాగానే ఉంది కాని అమ్మహస్తం సరుకులు లేక సతికలబడింది, ఇందిరమ్మకలలు ఇంటిబాసే అలగడంతో కిసుక్కుమంది, బంగారు తల్లి పథకం బండతో బాదకుండా చూసుకోవడం బెటర్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: