పోలీస్ బాస్ కథ ముగిసింది. చివరకు ఆయనను క్యాట్ కూడా బాబు నీ సర్వీసు చాలు అంది. ఆయనను వెనుకేసుకొచ్చిన ప్రభుత్వం కూడా చేతులెత్తేసింది. డిజిపి దినేష్ రెడ్డిని పదవిలో కొనసాగించండం మావల్ల కాదని ప్రభుత్వం లేఖ ఇచ్చింది. దీంతో ఆయన పదవి ఊడిపోయింది. ఇక ఆయన స్థానంలో ఎవరు వస్తారనేది రాష్ట్రంలో చర్చనీయాంశం అయింది.

ప్రభుత్వానికి ఆయన పోలీసు నిబందనలు కూడా పక్కన బెట్టి ఎన్నో సంధర్బాల్లో విదేయతను చాటుకున్నందుకు ఆయన మంచి బహుమతే లభించింది అంటున్నారు పోలీసు పెద్దలు. రాజకీయులు అవసరానికి వాడుకుని ఆతర్వాత ఎలా  అంటే కూరలో కరివేపాకులా తీసేస్తారో దినేష్ రెడ్డి ఉదంతమే ఓ ఉదహరణ అని కూడా పోలీసుల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఆయనపై సిబిఐ విచారణకూడా మొదలయింది. అంటే ఆయనకు అండగా ఉంటుందనునకున్న ప్రభుత్వం కూడా మొహం చాటేయడంతో ఇక దినేష్ రెడ్డి పరిస్థితి గందరగోళంలో పడ్డట్టే అంటున్నారు. అయితే సుప్రీం ఆదేశాల మేరకు డిజిపి పదవి లో కనీసం రెండేళ్లు ఉండాలన్న నిబందనను వర్తింప చేయాలని ఆయన క్యాట్ లో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేసారు. దీనిపై క్యాట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: