ఈ ఆధునిక కాలంలో టెక్నాలజీ ఎంత పెరిగిందో మనిషి తీరు  తెన్నులు కూడా అలాగే మారాయి.  మనిషి తన జీవితంలో సెల్ ఫోన్ ముఖ్యభాగంగా భావిస్తున్నాడు. అందులోనూ అన్ని హంగులతో కూడుకున్న సెల్ ఫోన్ అతి తక్కువ ధరలకు లభించడంతో ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగిస్తున్నారు. మరి కొందరైతే సెల్ ఫోన్ దుష్ట కార్యాలకే ఉపయోగిస్తున్నారు.  ఎంజాయ్ మెంట్ కోసమే ఈ పరికరం అన్నట్లుగా భావిస్తున్నారు. సెల్ఫీ ఫోటోలు తీసుకోవడం, అమ్మాయిల అందచందాలు షూట్ చేయడం, మరి కొందరు నీచులు అసాంఘిక కార్యకాలపాలు చేస్తూ సెల్ తో షూట్ చేయడం పరిపాటైంది.  తాజాగా ఈ ఇద్దరు యువకులు తమ జల్సా కోసం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నారు. ఎంత నీచంగా అంటే ఒక వైపు నిండుప్రాణం కండ్లముందు గాల్లో కలిసిపోతుంటే కాపాడే అవకాశం ఉన్నా.. ఆ పనిచేయకుండా ఇద్దరు యువకులు ఆ సన్నివేశాన్ని ఫొటోలు తీస్తూ జల్సా చేశారు.

విషయానికి వస్తే... కొట్టాయం సమీపంలోని ముత్తాంబలం రైల్వే ట్రాక్‌పై బుధవారం సాయంత్రం లైలా థంకచాన్(47) అనే మహిళ నడుచుకుంటూ వెళ్తున్నది. అటుగా ఓ రైలు వస్తున్న విషయాన్ని ఆమె గమనించలేదు. అక్కడే ఉన్న ఆ యువకులు దాదాపు ఆమె దగ్గరే ఉన్నారు. ఒక్క మాట ఆమెను గట్టిగా మందలిస్తే అక్కడ నుంచి పక్కకు తప్పుకునేది కాని ఆ దుర్మార్గులు ఆ పని చేయలేదు పైగా పైశాచికంగా సెల్ లో షూట్ చేస్తున్నారు. రైలు వచ్చింది ఆ మహిళను ఢీ కొట్టి వెళ్లింది ఇదంతా తమ సెల్‌ఫోన్లలో ఫొటోలు తీశారు. ఇది గమనిస్తున్న రైల్వే గేట్‌కీపర్ వెంటనే రెడ్ సిగ్నల్ ఇచ్చానని, అప్పటికే జరగాల్సిన ప్రమాదం జరిగిపోయిందని, మహిళపై నుంచి రైలు దూసుకెళ్లి ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: