గత కొంత కాలంగా సినిమాలు లేక ఐటమ్ సాంగ్స్ తో సరిపెట్టుకుంటున్న చార్మికి అనుకోకుండా కాలం కలిసి వచ్చింది.  పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘జ్యోతిలక్ష్మీ’ చిత్రంలో చార్మి  బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇది లేడీ ఓరియంటెడ్ చిత్రం. పాత సినిమాలో జ్యోతి లక్ష్మి కి సంబంధించిన స్టోరీ కాదని దర్శకులు ముందుగానే చెప్పారు.  ఇందులో ఛార్మీ నటి జ్యోతిలక్ష్మీగా నటిస్తోంది. నటిగా కొనసాగుతున్న జ్యోతిలక్ష్మీ అనుకోని సంఘటనలతో కాల్ గర్ల్ గా మారిపోతుందట. హై క్లాస్ కాల్ గర్ల్ గా మారిన జ్యోతిలక్ష్మీ జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయనేదే ఈ చిత్రం కథ అని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో కొందరు హీరోయిన్లు కెరీర్ లో లగ్జరీగా బతకటం అలవాటై ఇండస్ట్రీలో చోటు లేక జీవితాలు అదోగతి పాలైనపుడు తప్పని సరి పరిస్థతిలో కాల్ గర్ల్స్ గా మారిన సంఘటనలు లేకపోలేదు. బాలీవుడ్ లో అయితే మరీను. వీటి కాన్సెప్ట్ పై నిర్మిస్తున్న చిత్రం జ్యోతి లక్ష్మి.


చార్మీ హాట్ ఫోటో


గతంలో హీరోయిన్ గా కెరియర్ ఆరంభించి, సరైన అవకాశాలు రాకపోవడంతో కాల్ గర్ల్ గా మారిన ఓ హీరోయిన్ ఇటీవల పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ఉద్ధంతం అందరికీ తెలిసిందే. ఆ హీరోయిన్ జీవితాన్ని ఆధారంగా తీసుకునే పూరి జగన్నాధ్ ‘జ్యోతిలక్ష్మీ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు ఫిలింనగర్ సమాచారమ్. ఇందులో ఛార్మీ కొన్ని బోల్డ్ సీన్స్ లో కూడా నటిస్తోందట. 


మరింత సమాచారం తెలుసుకోండి: