టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు తన సత్తాని చాటిన తెలుగు నటి రోజా అంటే తెలియని వారుండరు. ప్రస్తుతం రోజా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున నగరి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తను ఎప్పుడైతే ఎమ్మెల్యేగా నియమితులయ్యారో అప్పటి నుండి సినిమాల్లో అప్పుడప్పుడు కనిపిస్తూ వస్తున్నారు.

అయితే బుల్లితెరపై గేమ్ షోలలో మాత్రం రోజా రెగ్యులర్ గా టచ్ లో ఉంటూనే ఉంది. ఇదిలా ఉంటే తాజాగా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రోజాకి సంబంధించిన ఓ న్యూస్ హల్ చల్ చేస్తుంది. రోజా వారసురాలుగా రోజా కుమార్తె అన్షు మల్లిక సిల్వర్ స్క్రీన్ తెరంగేట్రానికి సన్నాహాలు జరుగుతున్నట్లు టాలీవుడ్ సమాచారం.

విశ్వసనీయ సమాచారం ప్రకారం రోజా కుమార్తెను సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి రంగం సిద్ధం అవుతున్నట్లు చెపుతున్నారు. ఇదిలా ఉంటే రోజా కుమార్తె అన్షు, ఇప్పటికే తమిళ చిత్రంలో బాల నటిగా తెరంగేట్రం చేసింది. త్వరలో టాలీవుడ్ కి చెందిన ఓ బాలల మూవీలలో అన్షు లీడ్ రోల్ లో నటించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

ప్రస్తుతం ఆ కథకి సంబంధించిన చర్ఛలు చివరిదశలో ఉన్నాయి. రోజాకి సైతం టాలీవుడ్ కి చెందిన కొత్త దర్శకుడు చెప్పిన బాలల కథ, చాలా బాగా నచ్చిందట. 12 ఏళ్ల తన కుమార్తెను బాలనటిగా పరిచయం చేసి, తరువాత ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కెరీర్ ని కొనసాగించాలని రోజా కోరుకుటుందని ఇండస్ట్రీ టాక్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: