2015 గాను తెలుగు ఇండస్ట్రీలో నందమూరి కుర్రోళ్లకు తెగ కలిసి వస్తుంది. కళ్యాన్ రామ్ స్వియ నిర్మాణంలో ‘పటాస్ ’ సూపర్ హిట్ టాక్ వచ్చింది. పూరీ జగన్నాధ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ‘టెంపర్’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ విజయ ఆనందం ఎన్టీఆర్ తెగ ఎంజాయ్ చేస్తున్నాడట. ఇదే ఊపు మీద ఎన్టీఆర్ దర్శకుడు సుకుమార్ తో సినిమా ఒప్పుకున్నారు.  ఎన్టీఆర్-సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 17 నుంచి ప్రారంభం కానుంది.

టెంపర్ చిత్రంలోని ఎన్టీఆర్ స్టిల్

NTR-Sukumar considering

ఫస్ట్ షెడ్యూల్ మొత్తం లండన్‌లో షూట్ చేయనున్నారు. లండన్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా ఎక్కువ భాగం షూటింగ్ జరుగుతుందని సమాచారం. ఈ సినిమా కోసం సుకుమార్ ఎన్టీఆర్ టెంపర్ సినిమాలోని దండయాత్ర ఇది దయాగాడి దండయాత్ర డైలాగ్‌లోని దండయాత్ర పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర పతాకంపై బీవీఎస్ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్. జగపతిబాబు ఎన్టీఆర్‌కు తండ్రిగా నటిస్తున్నారు. వచ్చే సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసే అవకాశాలున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: